గుండె కావాలి ప్రేమ హుండీ!
ప్రవచనాలు పలకండి!
ప్రచండ వాగ్భుషితుల్లారా!
నిత్య
ప్రవచన కర్తల్లారా!
అలుపు లేక పలకండి!
ఆకాశం ప్రతి ధ్వనించేలా!
ఎలుగెత్తి ప్రవచించండి!
నేటి యువతకు
నర నరాన నింపండి!
మనకు కాపలా!
మన ప్రాణాలకు దాపలా!
వారేనని!
అవతారలెత్తి ఆదుకునేవారు!
ఆ దేవదేవుల్లో,
ఆది దేవతలో కాదని!
ఆపత్ భాంధవులు!
ఆపత్కాల బంధువులు!
ఆపద మన దరి చేరనివ్వని,
సరిహద్దు సైనికులని!
వారే నిజ దైవాలని!
గొంతు చించుకు చెప్పండి!
వారి త్యాగాలకు వంత పలకండి!
శిల కొలువైన గుడి లో కాదు!
వీలయితే!
ప్రతి ఇంటి గడపలో!
వారికోసం!
గుండె నిండా ప్రేమతో!
ఓ హుండీ పెట్టమనండి!
పది రూపాయలైనా!
పదిలంగా దాచమనండి!
ఆత్మీయంగా మూటగట్టి పట్టుకెళ్లమనండి!
మన కోసం అమరులైన!
వారింట పొంగే కన్నీటిని
తుడవ మనండి!
మాకోసం మీరైతే,
మీకోసం మేమని భరోషా,
ఇవ్వమనండి!
ఓ సరస్వతిపుత్రులారా!
సత్యానువర్తుల్లారా!
పురాణోపాషకుల్లారా!
చెప్పండి చెప్పండి!
ప్రవచనం హోరుగా!
ప్రవచించండి జోరుగా!
మీ తీరుగా!
మాతృ భూమికోసం!
మరు భూమిని ముద్దాడే,
ధైర్యం వారిదేనని!
ప్రతి పౌరునికి ఇదే విధిగా!
బోధించండి!
ఓ కర్తవ్య దీక్షగా!
కంకణం ధరించమనండి!
శిల కోసం కాదు నిత్య ప్రార్ధన!
ఇల నీకోసం, దేశం కోసం, నేలకొరిగిన వాని కోసం!
ప్రాణాన్ని తృణ ప్రాయంగా!
త్యజించిన వాని కోసం!
ఆలపించమనండి!
నిత్య అష్టోత్తరం!
