సిస్టర్ నివేదిత

*సిస్టర్ నివేదిత*

*పేరు మరియు జననం:*
*సిస్టర్ నివేదిత,*
*”అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్”*, *1867 అక్టోబర్ 28న ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌లోని డంగనన్‌లో జన్మించారు. “నివేదిత”*
*అనే పేరు (అర్థం: దేవునికి అంకితమైనవారు) స్వామి వివేకానంద ఆమెకు 1898లో బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సందర్భంలో ఇచ్చారు.*

*కుటుంబం*
*తల్లిదండ్రులు: తండ్రి శామ్యూల్ రిచ్‌మండ్ నోబుల్, మెథడిస్ట్ ప్రొటెస్టంట్ మత గురువు మరియు సామాజిక సేవకుడు; తల్లి మేరీ ఇసబెల్ నోబుల్.*
*కుటుంబం స్కాటిష్ వంశానికి చెందినది, ఐదు శతాబ్దాల క్రితం ఐర్లాండ్‌లో స్థిరపడింది.*

*బాల్యం:*

*మార్గరెట్ ఆరుగురు సోదరీసోదరులలో ఒకరు. తండ్రి సేవా సిద్ధాంతం (“సేవ ద్వారా దేవుని ఆరాధన”) ఆమె ఆలోచనలను బాగా ప్రభావితం చేసింది. 1877లో ఆమె 10 ఏళ్ల వయస్సులో తండ్రి మరణించారు, ఇది ఆమె జీవితంలో భావోద్వేగ ప్రభావం చూపింది.*

*ఆధ్యాత్మిక అన్వేషణ:*

*యవ్వనంలో ఒక వెల్ష్ యువకుడితో ప్రేమ సంబంధం విఫలమైంది, ఇది ఆమెను మానసికంగా కృంగదీసింది. అదే సమయంలో, క్రైస్తవ మతంలోని సంప్రదాయ బోధనలపై అసంతృప్తి ఆమెను కొత్త ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది.*

*విద్య మరియు వృత్తివిద్య:*

*మార్గరెట్ హాలిఫాక్స్ కళాశాలలో చదివారు, ఇక్కడ భౌతిక శాస్త్రం, సంగీతం, కళలు, సాహిత్యం వంటి విషయాలను అభ్యసించారు. ఆమె విద్యా విధానంలో స్వీయ-అభ్యాసం మరియు సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చారు.*

*వృత్తి:*

*1884లో, 17 ఏళ్ల వయస్సులో, కెస్విక్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తిని ప్రారంభించారు.*

*1886-1889 మధ్య రగ్బీ, వ్రెక్స్‌హామ్, చెస్టర్‌లలోని పాఠశాలల్లో పనిచేశారు.జోహాన్ హెన్రిచ్ పెస్టాలోజ్జి మరియు ఫ్రీడ్రిచ్ ఫ్రోబెల్ లాంటి విద్యావేత్తల ప్రగతిశీల విధానాల నుండి స్ఫూర్తి పొందారు, ఇవి బాలల సహజ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాయి.*

*1892లో వింబుల్డన్‌లో కింగ్స్లీగేట్ పాఠశాలను స్థాపించారు, ఇది ఆమె విద్యాదర్శనాన్ని ప్రతిబింబిస్తుంది.*

*ఆధ్యాత్మిక అసంతృప్తి:*

*ఉపాధ్యాయురాలిగా విజయవంతమైనప్పటికీ, క్రైస్తవ మతం ఆమె ఆధ్యాత్మిక ఆకాంక్షలను తీర్చలేకపోయింది, దీనివల్ల ఆమె ఇతర తాత్విక మార్గాలను అన్వేషించారు.*

*”స్వామి వివేకానందతో మొదటి సమావేశం” (1895):*

*1895 నవంబర్ 10న లండన్‌లో 63 సెయింట్ జార్జ్‌స్ రోడ్‌లో లేడీ ఇసబెల్ మార్గెసన్ నివాసంలో స్వామి వివేకానంద ఉపన్యాసానికి హాజరయ్యారు.*
*ఆయన వేదాంత దర్శనం, హిందూ తాత్వికత, మరియు “మానవ సేవే మాధవ సేవ” అనే సిద్ధాంతం ఆమెను లోతుగా ఆకర్షించాయి.*

*నిరంతర సంపర్కం:*

*1895-1896 మధ్య స్వామిజీతో అనేక చర్చల్లో పాల్గొన్నారు, ఇవి ఆమె జీవిత దిశను మార్చాయి. వివేకానంద ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించి, భారతదేశంలో సేవ చేయమని ప్రోత్సహించారు.*

*భారతదేశానికి రాక (1898):*

*1898 జనవరి 28న కలకత్తాకు చేరుకున్నారు. మార్చి 25న బెలూర్ మఠంలో బ్రహ్మచర్య వ్రతం స్వీకరించి, స్వామి వివేకానంద “నివేదిత” అనే పేరు ఇచ్చారు. ఆమె హిందూ మతాన్ని అంగీకరించిన తొలి పాశ్చాత్య మహిళగా చరిత్రలో నిలిచారు.*

*శారదా దేవితో సంబంధం:*

*1898 మార్చి 17న శారదా దేవిని కలిసి, ఆమెను “ఖూకి” (చిన్న అమ్మాయి) అని పిలిచారు. శారదా దేవి ఆమెకు తల్లిలాంటి మార్గదర్శనం అందించారు.*

*భారతదేశంలో కృషి:*

*సిస్టర్ నివేదిత కలకత్తాలో స్థిరపడి, భారతీయ సంస్కృతిని పూర్తిగా స్వీకరించారు. ఆమె జీవితం విద్య, సామాజిక సేవ, స్వాతంత్ర్య ఉద్యమం, సాంస్కృతిక జాగృతి, మరియు వైజ్ఞానిక పరిశోధనలలో నిమగ్నమైంది.*

*భారతీయ విద్యార్థుల విద్య కోసం:*

*సిస్టర్ నివేదిత గర్ల్స్ స్కూల్ (1898):1898 నవంబర్ 13న కలకత్తాలోని బాగ్‌బజార్‌లో 16 బోసెపారా లేన్‌లో బాలికల పాఠశాలను స్థాపించారు.

*శారదా దేవి ఈ పాఠశాలను ఉద్ఘాటించారు.ఈ పాఠశాల బాలికలకు ఆధునిక విద్య (సైన్స్, సాహిత్యం)తో పాటు భారతీయ విలువలు (సంస్కృతి, ధర్మం) బోధించింది.*
*సీవింగ్, హైజీన్, నర్సింగ్ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా నేర్పించారు.ఈ పాఠశాల మహిళల సాధికారతకు బీజం వేసింది, ఇది ఆ కాలంలో విప్లవాత్మకమైన చర్య.*

*ప్రపంచ వేదిక:*

*1899లో అమెరికాకు వెళ్లి, న్యూయార్క్, షికాగోలలో భారతీయ విద్యా విధానాలు, సంస్కృతిపై ఉపన్యాసాలు ఇచ్చారు.*
*ఈ ఉపన్యాసాలు భారతదేశంపై పాశ్చాత్య ఆసక్తిని పెంచాయి.*

*సామాజిక సేవ:*
*ప్లేగ్ సేవలు (1899):*

*1899లో కలకత్తాలో ప్లేగ్ వ్యాధి విజృంభించినప్పుడు, నివేదిత స్వయంగా రోగులను సంరక్షించారు, వీధులను శుభ్రం చేశారు, మరియు పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఆంగ్ల పత్రికల ద్వారా సహాయం కోసం అప్పీల్ చేసి, స్థానిక యువతను సేవలో పాల్గొనేలా ప్రోత్సహించారు.*

*పేదల సేవ:*

*అట్టడుగు వర్గాలకు ఆహారం, వస్త్రాలు, వైద్య సహాయం అందించారు. మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడారు, వితంతువులు మరియు నిరాదరణకు గురైన మహిళల సాధికారతకు కృషి చేశారు.*

*విపత్తు సహాయం:*

*1897లో బెంగాల్ కరువు మరియు 1905లో తూర్పు బెంగాల్ విభజన సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.*

*స్వాతంత్ర్య ఉద్యమంయువత జాగృతి:*

*స్వామి వివేకానంద మరణం (1902) తర్వాత, నివేదిత స్వాతంత్ర్య ఉద్యమంలో యువతను ఉత్తేజపరిచేందుకు సమావేశాలు, ఉపన్యాసాలు నిర్వహించారు.”స్వదేశీ” ఉద్యమాన్ని ప్రోత్సహించి, భారతీయ వస్తువుల వాడకాన్ని ప్రచారం చేశారు.*

*విప్లవకారులతో సహకారం:*

*అనుశీలన్ సమితి వంటి రహస్య సంస్థలకు మద్దతు ఇచ్చారు. అరవింద ఘోష్, బరీంద్ర ఘోష్ వంటి విప్లవకారులతో సన్నిహితంగా పనిచేశారు.*

*1902లో మహాత్మా గాంధీని కలిసి, ఆయన స్వాతంత్ర్య ఆలోచనలను ప్రశంసించారు.1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపైన నిఘా పెట్టింది.*

*జాతీయ గీతం రూపకల్పన:*

*ఆమె “థండర్‌బోల్ట్” చిహ్నంతో ఒక జాతీయ జెండాను రూపొందించారు, ఇది స్వాతంత్ర్య సంకల్పాన్ని సూచిస్తుంది.*

*పత్రికా సంపాదకత్వం:*

*”కర్మ యోగిన్” పత్రికకు సంపాదకత్వం వహించి, స్వాతంత్ర్య ఆలోచనలను ప్రచారం చేశారు.*

*సాంస్కృతిక జాగృతిభారతీయ సంస్కృతి ప్రచారం:*

*పాశ్చాత్య దేశాలలో భారతీయ కళలు, సాహిత్యం, ధర్మం ఔన్నత్యాన్ని చాటారు. 1899లో అమెరికా, ఇంగ్లాండ్‌లో ఇచ్చిన ఉపన్యాసాలు భారత సంస్కృతిని ప్రపంచ వేదికపై పరిచయం చేశాయి.రవీంద్రనాథ్ ఠాగూర్, అబనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్ వంటి కళాకారులను ప్రోత్సహించారు. భారత మాత చిత్రానికి స్ఫూర్తిగా నిలిచారు.*

*ఐక్యత కార్యక్రమాలు:*

*హిందువులలో అనేక  సముదాయాల మధ్య సామరస్యం కోసం కార్యక్రమాలు నిర్వహించారు, జాతీయ ఐక్యతను బలోపేతం చేశారు.*

*రచనలు:*

*ఆమె రచనలు భారత సంస్కృతిని పాశ్చాత్యులకు అర్థమయ్యేలా వివరించాయి:*

*The Web of Indian Life (1904):*
*భారతీయ సమాజం, స్త్రీల జీవన విధానం, సంస్కృతి గురించి వివరించింది.*

*Kali the Mother (1900):*
*హిందూ ఆధ్యాత్మికత, శక్తి ఆరాధనను వివరించింది.*
*The Master as I Saw Him (1910):*
*స్వామి వివేకానంద జీవితం, బోధనల గురించి రాసిన గ్రంథం.*

*Cradle Tales of Hinduism (1907):*

*హిందూ పురాణ కథల సంకలనం, ఇది పాశ్చాత్య పాఠకులకు హిందూ ధర్మాన్ని సులభంగా అర్థమయ్యేలా చేసింది.*

*Notes of Some Wanderings with the Swami Vivekananda (1913):*

*వివేకానందతో కలిసి చేసిన ప్రయాణాల వివరణ.*

*Studies from an Eastern Home (1913):*
*భారతీయ జీవన విధానం గురించి వ్యాసాలు.*

*వైజ్ఞానిక పరిశోధన జగదీశ్ చంద్ర బోస్ సహకారం:*
*నివేదిత జగదీశ్ చంద్ర బోస్ శాస్త్రీయ పరిశోధనలకు సహాయం చేశారు, ఆయన రచనలను సంపాదన చేశారు, మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలతో సంప్రదింపులు ఏర్పాటు చేశారు.*

*టాటా సహకారం:*

*జమ్‌షెడ్‌జీ టాటాను వైజ్ఞానిక సంస్థల స్థాపనకు ప్రోత్సహించారు, ఇది తర్వాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) ఏర్పాటుకు దారితీసింది.*

*సవాళ్లువిదేశీ మహిళగా సవాళ్లు:*

*భారత సమాజంలో ఒక పాశ్చాత్య మహిళగా, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను ఎదుర్కొన్నారు.*
*బ్రిటిష్ ప్రభుత్వం ఆమె స్వాతంత్ర్య కార్యకలాపాల వల్ల నిఘా పెట్టింది.*

*ఆరోగ్య సమస్యలు:*

*1900ల చివరలో ఆమె ఆరోగ్యం క్షీణించినప్పటికీ, సేవా కార్యక్రమాలను ఆపలేదు.*
*మలేరియా, ఇతర అనారోగ్యాలతో బాధపడ్డారు.*

*ఆర్థిక సమస్యలు:*

*పాఠశాల నిర్వహణ, సామాజిక కార్యక్రమాల కోసం నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.*

*మరణం మరియు వారసత్వం:*

*1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో 43 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మరణించారు.*

*”ఆమె సమాధిపై ఎపిటాఫ్”:*
*”Here lies Sister Nivedita who gave her all to India”*

*(ఇక్కడ సిస్టర్ నివేదిత నిద్రిస్తున్నారు, ఆమె భారతదేశానికి తన సర్వం అంకితం చేశారు)*.

*వారసత్వం:*

సిస్టర్ నివేదిత గర్ల్స్ స్కూల్ రామకృష్ణ శారదా మిషన్ నిర్వహణలో 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతోంది.*

*స్వాతంత్ర్య ఉద్యమం:*

*ఆమె యువతలో జాగృతి, స్వదేశీ ఉద్యమంలో పాత్ర భారత స్వాతంత్ర్యానికి బలం చేకూర్చాయి.*

*సాంస్కృతిక పునరుజ్జీవనం:*

*ఆమె రచనలు, ఉపన్యాసాలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి.*

*స్మారకాలు:*

*1968లో భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.దక్షిణేశ్వర్ సమీపంలో “నివేదిత బ్రిడ్జ్” ఆమె పేరిట ఉంది.బరానగర్‌లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో “నివేదిత భవన్” స్థాపించబడింది.*

*చెన్నైలో సిస్టర్ నివేదిత అకాడమీ ఆమె స్ఫూర్తితో నడుస్తోంది.*

*సిస్టర్ నివేదిత ప్రభావం మహిళల సాధికారత: ఆమె పాఠశాల మరియు సామాజిక కార్యక్రమాలు మహిళల విద్య, స్వావలంబనకు బాటలు వేశాయి.*

*స్వాతంత్ర్య స్ఫూర్తి: యువతలో జాతీయ భావాన్ని రగిలించి, స్వాతంత్ర్య ఉద్యమానికి ఊతం ఇచ్చారు.సాంస్కృతిక వారధి: భారతీయ సంస్కృతిని పాశ్చాత్య ప్రపంచానికి, పాశ్చాత్య ఆధునికతను భారతీయులకు అందించారు.*

*వైజ్ఞానిక పురోగతి:*

*బోస్, టాటా వంటి వారితో సహకారం భారత వైజ్ఞానిక రంగాన్ని బలోపేతం చేసింది.*

*స్ఫూర్తిదాయక జీవితం: ఆమె త్యాగం, అంకితభావం ఈ రోజు కూడా యువతకు స్ఫూర్తినిస్తాయి.*

*సిస్టర్ నివేదిత ఒక ఐరిష్ మహిళగా భారతదేశానికి వచ్చి, స్వామి వివేకానంద స్ఫూర్తితో తన జీవితాన్ని భారత సేవకు అంకితం చేశారు. ఆమె విద్య, సామాజిక సేవ, స్వాతంత్ర్య ఉద్యమం, సాంస్కృతిక జాగృతి, వైజ్ఞానిక పరిశోధనలలో చేసిన కృషి భారత సమాజంలో ఆధునిక ఆలోచనలకు బీజం వేసింది. ఆమె జీవితం సేవ, త్యాగం, జాతీయ భావంతో నడిచిన ఒక అసాధారణ యాత్ర, ఇది ఈ రోజు కూడా యువతకు స్ఫూర్తినిస్తుంది.*

ప్రవచన కర్తల్లారా!

గుండె కావాలి ప్రేమ హుండీ!

ప్రవచనాలు పలకండి!
ప్రచండ వాగ్భుషితుల్లారా!
నిత్య
ప్రవచన కర్తల్లారా!

అలుపు లేక పలకండి!
ఆకాశం ప్రతి ధ్వనించేలా!
ఎలుగెత్తి ప్రవచించండి!

నేటి యువతకు
నర నరాన నింపండి!
మనకు కాపలా!
మన ప్రాణాలకు దాపలా!
వారేనని!

అవతారలెత్తి ఆదుకునేవారు!
ఆ దేవదేవుల్లో,
ఆది దేవతలో కాదని!

ఆపత్ భాంధవులు!
ఆపత్కాల బంధువులు!
ఆపద మన దరి చేరనివ్వని,
సరిహద్దు సైనికులని!
వారే నిజ దైవాలని!

గొంతు చించుకు చెప్పండి!
వారి త్యాగాలకు వంత పలకండి!

శిల కొలువైన గుడి లో కాదు!

వీలయితే!
ప్రతి ఇంటి గడపలో!
వారికోసం!
గుండె నిండా ప్రేమతో!
ఓ హుండీ పెట్టమనండి!

పది రూపాయలైనా!
పదిలంగా దాచమనండి!

ఆత్మీయంగా మూటగట్టి పట్టుకెళ్లమనండి!
మన కోసం అమరులైన!
వారింట పొంగే కన్నీటిని
తుడవ మనండి!

మాకోసం మీరైతే,
మీకోసం మేమని భరోషా,
ఇవ్వమనండి!

ఓ సరస్వతిపుత్రులారా!
సత్యానువర్తుల్లారా!
పురాణోపాషకుల్లారా!

చెప్పండి చెప్పండి!
ప్రవచనం హోరుగా!
ప్రవచించండి జోరుగా!
మీ తీరుగా!

మాతృ భూమికోసం!
మరు భూమిని ముద్దాడే,
ధైర్యం వారిదేనని!

ప్రతి పౌరునికి ఇదే విధిగా!
బోధించండి!
ఓ కర్తవ్య దీక్షగా!
కంకణం ధరించమనండి!

శిల కోసం కాదు నిత్య ప్రార్ధన!

ఇల నీకోసం, దేశం కోసం, నేలకొరిగిన వాని కోసం!

ప్రాణాన్ని తృణ ప్రాయంగా!
త్యజించిన వాని కోసం!

ఆలపించమనండి!
నిత్య అష్టోత్తరం!

అనగనగా ఒక రాజు!….?


🔹🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹


*అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు*

రాజు గారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషి లోని సప్త ధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే..మనిషి జీవితాన్ని కొనసాగించడం, జీవితమే ఒక వేట, వేటే ఒక జీవితం

రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే ..
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1. కామ
2. క్రోధ
3. లోభ
4. మోహ
5.  మద
6. మాత్సర్యాలు

వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండ గట్టవచ్చు..
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.అందుకే కథలో ఆరు చేపలను ఎండ గట్టినట్టు చెప్పారు.రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.ఏమిటా చేప.?

*అది మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా అది ఎండదు*

మనస్సు అంటే ఏమిటి..?మనస్సు అంటే
సంకల్ప వికల్పాలు.ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచు కొస్తుంది.మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.

కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది..?
గడ్డిమేటు. గడ్డిమేటు అంటే ఏమిటి.? కుప్పపోసిన అజ్ఞానం.

గడ్డిమేటులా పేరుకు పోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా.? మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.

కానీ అజ్ఞానం అలాంటిది కాదు.జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే.
ఆ కుప్ప తరిగేది కాదు., తగ్గేది కాదు.

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి

ఆవు వచ్చి మేయాలి.ఆవు ఎక్కడనుంచి రావాలి.?
అసలు. ఆవు అంటే ఏమిటి.? ఆవు అంటే
*జ్ఞానం*

జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే..
అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ, జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు.
_(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)_
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.



ఈ గోవును ఎవరు మేపాలి.?గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు..?సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మనందరికి ధారపోశాడు.ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.

ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?

అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ.ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.

ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.ఓ జగన్మాతా.. ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.

ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?వాడికి చీమ కుట్టింది.

ఎక్కడిది చీమ.?దానికి ఇంకో పేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది.

మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేశాడా..?లేదు… అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.

చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే..
సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.

చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట.?
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే
మన పెద్దలు మన బాల్యంలోనే..ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
*శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*

లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి?

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు…
.
భర్త – నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.
.
భార్య – (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?
.
భర్త – ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..
.
భార్య – (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..
.
ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.
.
భర్త – నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..
.
భార్య – ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..
.
భర్త – గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..
.
భార్య – చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..
.
భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..
.
మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.
.
ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.
.
ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.
.
నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
.
అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది..
.
విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.
.
మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. “హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు”. ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. “మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది… ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .
.
రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..
.
నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.
.
ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.
.
ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది… ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..
.
ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు..”నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది..” అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..
.
అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్
ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.
.
రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది.
.
చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, “మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి” అని చెప్పాడు..
.
తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని.
.
అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే….
.
జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.
.
కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .
.
అప్పుడు అతను నవ్వుతూ “మరణం మనల్ని దూరం చేసేవరకు… నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను .” అని రాయమని చెప్పాడు..
.
ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.
.
.
.
.
.
.
.
.
అప్పటికే ఆమె చనిపోయింది.
.
ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..
.
తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.
.
మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.
.
మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.
.
మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు..
.
చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.
.
(మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే, ఒక వివాహం బంధాన్ని కాపాడే అవకాశం ఉంది.)

టిటిడి వాలంటీర్ సేవా బుకింగ్

ఓం నమో వేంకటేశాయ.

టీటీడీ 30 వ తారీకు జూన్ నెలకు వాలంటీర్ సేవ బుకింగ్ రిలీజ్ చేస్తున్నది.

వాలంటీర్ గా  తిరుమల లో సేవా చేయాలనుకునే వాళ్ళు సంప్రదించగలరు.

Mottobyte
8520986185

రాఘవ రావు… ఓ ఇల్లు

*కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.

ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపుతో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.*

*మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?” రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే. అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”*



*ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు… “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.*

*అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు” ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.*

*మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు. వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.*

*నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.*

*కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది. ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది. ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్ లో టీచర్ గా చేరింది.*

*వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు. వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని..! మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాళే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.*

*ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.*

*మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.*

*మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు. అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు.*

*తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.*

*రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు.*

*వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ… ”మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.*

*అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.*

*రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.*

*కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.*

*వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు. తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు.*

*రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావుల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.*

*“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.*

*ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.*

*“పైస జారనీకు ప్రాణమున్నంతకు పైస పోయెనేని ప్రాణమాగు పైసలో నగలదు పరమార్ధమంతయు, పైసె యిలను వెలసె ప్రాణమగుచు!!*

*అదీ కథలోని నీతి!*
*విశ్రాంతజీవులందరూ,*
*తస్మాత్ జాగ్రత…*

*మీ కంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు… చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులుగా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది…. ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ..! ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్నలు, అత్త మామలు..!  ఆర్నెల్ల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది. 6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరు పిల్లలూ అలా లేరు కొందరు మాత్రమే…!  సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి…*

Scroll to Top