రాజు గారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషి లోని సప్త ధాతువులు. కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే..మనిషి జీవితాన్ని కొనసాగించడం, జీవితమే ఒక వేట, వేటే ఒక జీవితం
రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే .. మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 ) 1. కామ 2. క్రోధ 3. లోభ 4. మోహ 5. మద 6. మాత్సర్యాలు
వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండ గట్టవచ్చు.. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.అందుకే కథలో ఆరు చేపలను ఎండ గట్టినట్టు చెప్పారు.రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.ఏమిటా చేప.?
*అది మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు*
మనస్సు అంటే ఏమిటి..?మనస్సు అంటే సంకల్ప వికల్పాలు.ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచు కొస్తుంది.మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది..? గడ్డిమేటు. గడ్డిమేటు అంటే ఏమిటి.? కుప్పపోసిన అజ్ఞానం.
గడ్డిమేటులా పేరుకు పోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా.? మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు.జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే. ఆ కుప్ప తరిగేది కాదు., తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం. మరి అది పోవాలంటే ఏం చేయాలి
ఆవు వచ్చి మేయాలి.ఆవు ఎక్కడనుంచి రావాలి.? అసలు. ఆవు అంటే ఏమిటి.? ఆవు అంటే *జ్ఞానం*
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే.. అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ, జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు. _(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)_ జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
ఈ గోవును ఎవరు మేపాలి.?గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు..?సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మనందరికి ధారపోశాడు.ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ.ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.ఓ జగన్మాతా.. ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?వాడికి చీమ కుట్టింది.
ఎక్కడిది చీమ.?దానికి ఇంకో పేరే సంసారం. సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేశాడా..?లేదు… అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే.. సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట.? మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు మన బాల్యంలోనే..ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* *సర్వేజనా సుఖినోభవంతు* *లోకా సమస్త సుఖినోభవంతు* *శుభం భూయాత్* *ఓం శాంతి శాంతి శాంతిః* *స్వస్తి*
భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు… . భర్త – నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు. . భార్య – (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది? . భర్త – ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు.. . భార్య – (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది.. . ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. . భర్త – నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు.. . భార్య – ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు.. . భర్త – గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు.. . భార్య – చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది.. . భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది.. . మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. . ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. . ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది. . నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. . అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది.. . విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు. . మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. “హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు”. ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. “మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది… ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. . . రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు.. . నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది. . ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. . ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది… ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు.. . ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు..”నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది..” అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన.. . అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్ ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. . రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది. . చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, “మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి” అని చెప్పాడు.. . తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని. . అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే…. . జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. . కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది . . అప్పుడు అతను నవ్వుతూ “మరణం మనల్ని దూరం చేసేవరకు… నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను .” అని రాయమని చెప్పాడు.. . ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు. . . . . . . . . అప్పటికే ఆమె చనిపోయింది. . ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్.. . తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది. . మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. . మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది. . మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు.. . చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను. . (మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే, ఒక వివాహం బంధాన్ని కాపాడే అవకాశం ఉంది.)
ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది, నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? ” అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.
గ్యాస్ పొయ్యి మీదున్న – మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.
తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా – అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.
అలా 20 నిముషాలు మరిగించాక – స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.
నాన్న ‘ అలా ఎందుకు చేసాడా పని..’ అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,
” ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. ” అంది.
అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,
” ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.
కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, నీటిరంగునే మార్చింది.. అవునా..!!
ఇప్పుడు చెప్పు.. వీటిల్లో – నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?
మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. ) గట్టిపడిపోతావా..? పరిస్థితులను మారుస్తావా…?
ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది..” అన్నాడు.
ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..
” నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్..” కృతజ్ఞతాభావంతో అంది.
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* *సర్వేజనా సుఖినోభవంతు* *లోకా సమస్త సుఖినోభవంతు* *శుభం భూయాత్* *ఓం శాంతి శాంతి శాంతిః* *స్వస్తి*
✍️విజయానికి కావాల్సిందేమిటీ…? గొప్ప చదువులా… అదే అయితే ఆయనకి మనదేశం పేరు రాయడం కూడా సరిగ్గా చేతకాదు. పోనీ తాతలిచ్చిన ఆస్తిపాస్తులా అంటే… ఆయన పుట్టింది నిరుపేద కుటుంబంలో..
✍️మరి అటు చదువూ, ఇటు వారసత్వపు సంపదా ఏదీలేని.. ‘కిరణ్‌కుమార్’ పదివేల కోట్లరూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేత ఎలా అయ్యారూ..? ఆ మాట ఆయన్నే అడిగితే, ఇదిగో ఇలా చెబుతున్నారు…
✍️నేను పుట్టింది నెల్లూరులో. మీకు తెలుసో లేదో… నెల్లూరికి బంగారు నగల తయారీ కేంద్రంగా బాగా పేరుంది. అక్కడ పనిచేయడానికి మా కుటుంబం ఎనభై ఏళ్లకిందట రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడింది.
✍️నాన్న మూల్‌చంద్ జైన్… అమ్మ సుశీలాబాయి. వాళ్లకి తొమ్మిది మంది సంతానం. నేనే చివరి వాణ్ణి. ఆరుగురు అక్కలూ, ఇద్దరు అన్నలు నాకు. పెద్ద కుటుంబం కావడం వల్ల కటిక దారిద్య్రం తప్పలేదు.
✍️నాన్న బంగారు దుకాణాల్లోనూ, బట్టల దుకాణాల్లోనూ పనిచేసేవాడు. రోజుకి మూడుపూటలా కాదుకదా ఒక్కపూట తిండి దొరకడమే కష్టంగా ఉండేది.
✍️నేను చిన్నప్పుడు అందరితోపాటే బడిలో చేరాను కానీ… అదేమిటో నా బుర్రలోకి ఒక్క అక్షరం ముక్క కూడా వెళ్లేది కాదు.
✍️ఎలాగోలా ఐదో తరగతి దాకా నెట్టుకువచ్చినా… ఆ తర్వాత మానేశాను. అందుకనే నాన్న ‘మా ఖర్మకొద్దీ పుట్టావురా నువ్వు…!’’ అని ఎప్పుడూ తిడుతుండేవాడు.
✍️ఇంట్లోని కష్టాల వల్ల కావొచ్చు… తొమ్మిదేళ్లకే నాకు జీవితంపైన ఒక స్పష్టత వచ్చేసింది. అప్పట్లో నా ఈడు వాళ్లు బంగారు దుకాణాల్లో కూలీకి వెళుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లడం మొదలుపెట్టాను.
✍️మూడేళ్ల తర్వాతే నెల్లూరులో తయారుచేస్తున్న నగల్ని చెన్నై, కేరళల్లోని దుకాణాలకి హోల్‌సేల్‌గా అమ్ముతారని తెలిసింది. నేనూ అలా అమ్మాలనుకున్నా.
✍️మరి నగల తయారీకి బంగారం కావాలి కదా! మా ఇంట్లో అమ్మ భద్రంగా దాచుకున్న నాలుగు బంగారు గాజులుండేవి. ఆమెకి చెప్పకుండా వాటిని తీసుకెళ్లి కరిగించి… 65 గ్రాముల్లో కొన్ని జుమ్కీలు చేయించాను.
✍️వాటిని తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. అక్కడ నేను బాగా విన్న దుకాణం పేరు లలితా జ్యువెలరీసే! ఆ దుకాణం ముందు నిల్చున్నాను.
✍️అప్పుడే ఆ సంస్థ ఓనర్ కందస్వామి కారు దిగుతున్నారు. ఆయన దగ్గరకెళ్లి నాకొచ్చిన తెలుగు, హిందీ కలగలిపి ‘మీకోసం నగలు అమ్మడానికి నెల్లూరు నుంచి వచ్చాను’ అని చెప్పాను.
✍️పన్నెండేళ్ల కుర్రాణ్ణి కదా! ఏదో సరదాపడుతున్నానని అనుకున్నాడేమో ‘సరే చూపించు!’ అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుమ్కీలు చూపించాను! రోజూ కిలోల లెక్కన నగలు కొనే ఆయన… వాటిని చూసి నవ్వేశారు.
✍️అయినా నన్ను నిరుత్సాహపరచకుండా ‘వీటిని నేను టెస్ట్ చేయాలి… రేపు రా!’ అన్నారు. ఇంటికెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను.
✍️నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రం ‘ఇంట్లో మిగిలిన చివరి నగలవి… నువ్వే ఆలోచించుకో!’ అని మాత్రమే చెప్పింది.
✍️తర్వాతి రోజు ఉదయమే మళ్లీ లలితా జ్యువెలరీస్‌కి వెళ్లాను. నన్ను చూడగానే… ‘ఇలాంటివే మరిన్ని చేసుకురా!’ అని చెబుతూ… 15 వేల రూపాయలు డబ్బులిచ్చారు కందస్వామి.
✍️వ్యాపారిగా నా తొలి సంపాదన అది! అందులో వచ్చిన లాభంతో మరికాస్త బంగారం కొన్నాను. 24 గంటలపాటు తిండీ, నిద్రలన్నీ మాని ఈసారి వంద గ్రాముల నగలు తయారుచేసుకుని వెళ్లాను.
✍️సాధారణంగా అలా నగలు తయారుచేయడానికి వారం పడుతుంది. నేను రెండోరోజే ఆయన ముందుకి వెళ్లడం చూసి విస్తుపోయారాయన. క్రమంగా 200గ్రా., 300గ్రా., 1000గ్రా… అలా ఆరునెలల్లోనే మూడు కిలోల బంగారు నగలు చేసిచ్చే స్థాయికి చేరుకున్నాను.
✍️ఆ తర్వాతి నుంచీ పూర్తిగా నా దగ్గరే నగలు కొనడం ప్రారంభించారు. లలితా జ్యువెలరీస్‌తోపాటూ ఇతర పెద్ద దుకాణాలూ ఆర్డర్‌లు ఇచ్చాయి.
✍️దాంతో మొదటి ఏడాదే ఏడు లక్షల రూపాయల వ్యాపారం చేశాను. నేను మేజర్‌ని అయ్యాక అష్రఫ్ అనే మిత్రుడి భాగస్వామ్యంతో ‘ఏకే జ్యువెలర్స్’ పేరుతో హోల్‌సేల్ నగల దుకాణాన్ని రిజిస్టర్ చేశాను.
✍️ఎనిమిదేళ్లలో దక్షిణాదిలోనే నంబర్ వన్ హోల్‌సేల్ నగల తయారీదారుగా పేరు తెచ్చుకున్నాను. రోజూ కేవలం మూడునాలుగు గంటలే నిద్రపోయేవాణ్ణి.
✍️ఆ కఠోర శ్రమే నన్ను పందొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసింది. నా విజయానికి తొలిమెట్టుగా నిలిచిన లక్షణం అదే!
✍️పట్టుదల + సాహసం = కొత్తదనం..
✍️1996 ప్రాంతం… లలితా జ్యువెలరీస్ సంస్థ యాజమాన్యం నష్టాల్లో కూరుకుపోయింది. ‘అప్పులవాళ్ల వల్ల నేను అరెస్టు కావడమో… దుకాణాన్ని మూసేయడమో!’ రెండేదార్లున్నాయి నాకు అని నా ముందు కన్నీరుపెట్టుకున్నారు దాని యజమాని కందస్వామి.
✍️నాకు జీవితాన్నిచ్చిన సంస్థ అలా మునిగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోను?! అందువల్ల 1999లో నేనే దాన్ని కొన్నాను. కొన్నానే కానీ… ఆరునెలలపాటు నాకేమీ అర్థంకాలేదు.
✍️హోల్‌సేల్ వ్యాపారిగా గంటకి పది కిలోల నగలు అమ్మే నేను రీటైల్‌లో రోజంతా కష్టపడ్డా కిలో బంగారం నగల్ని అమ్మలేకపోయేవాణ్ణి. నాలుగేళ్లలోనే ‘అసలు ఇటు ఎందుకొచ్చానురా భగవంతుడా!’ అనే పరిస్థితిలో పడ్డాను.
✍️అయినాసరే, వెనక్కి తగ్గాలనుకోలేదు. కొత్తగా ఏమేం చేయొచ్చో ఆలోచించడం మొదలుపెట్టాను. నాణ్యత ఉన్నతంగా ఉండాలని దక్షిణాదిలోనే తొలిసారి బీఐఎస్ హాల్‌మార్కు నగల్ని పరిచయం చేశాను.
✍️వాటిని కూడా హోల్‌సేల్ ధరలకే అమ్మేవాణ్ణి. నా లాభాలు తగ్గించుకుని తరుగు తొమ్మిదిశాతం మించకుండా చూసుకున్నాను. ఇవన్నీ వినియోగదారుల్ని ఆకర్షించాయి. లాభాలు పెరిగాయి.
✍️కానీ, ‘మాకంటే నువ్వు తక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదంటూ’ నగల దుకాణాల సంఘాలు నాకు హుకుం జారీ చేశాయి… పట్టించుకోలేదు. పోటీదారులు నేరుగానే నన్ను బెదిరించారు… భయపడలేదు.
✍️నా పని నేను చేసుకుంటూ పోయాను. వాటిని పట్టించుకోని ధైర్యమే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తోంది. అదేలేకుంటే జీవితంలో సవాళ్ళని ఎదుర్కోలేం, కొత్తగా ఏదీ సాధించలేం.
✍️అందుకే మోడల్ అయ్యాను….
✍️మొదట్లో లలితా జ్యువెలరీస్‌కి నగలు సరఫరా చేయడం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. రాత్రి బస్సులకైతే ఛార్జీ రెండు రూపాయలు తక్కువని వాటినే ఎక్కేవాణ్ణి. లక్షలు సంపాదిస్తున్నప్పుడూ అంతే.
‘✍️లలితా జ్యువెలరీస్’ని కొన్నాకే చెన్నైకి మకాం మార్చాను. అక్కడ చెన్నైలోని మా ఇంటి నుంచి దుకాణానికి ఆటోలోనే వెళ్లేవాణ్ని. మాకున్న 21 దుకాణాల్లో ఎక్కడా ఛైర్మన్‌గా నాకంటూ ప్రత్యేక క్యాబిన్ ఉండదు.
✍️మిగతా ఉద్యోగులతోపాటు స్టోర్‌లోనే కూర్చుంటాను. మా సంస్థ ప్రకటనలని స్టార్ హీరోల చేత చేయించకపోవడానికీ అదే కారణం. నేనే నటించాలని అనుకున్నాక మేకప్‌లూ, విగ్గులూ వేసుకోమన్నారు చాలామంది.
✍️అది కూడా దండగ ఖర్చు అనిపించే నా గుండుతోనే టీవీల ముందుకు వచ్చేశాను. ఇలాంటివాటికి నిరాడంబరత అనే పెద్ద పదం అక్కర్లేదు… ఇదంతా కేవలం వ్యాపార మనుగడ కోసం ఆచితూచి ఖర్చుపెట్టడం మాత్రమే.
✍️కానీ జీవితంలో నాకంటూ కొన్ని కలలుండేవి. కారు కొనడం అందులో మొదటిది! లలితా జ్యువెలరీస్‌ని కొన్న చాలా ఏళ్ల తర్వాతే నేను కారుకొన్నాను. ఆ రోజు దానికి పూజ చేసి రాత్రి ఇంటికి తెచ్చాను.
పడుకున్నాక రెండుగంటలకి మెలకువ వచ్చింది. ‘నిజంగానే కారు కొన్నానా… అంత గొప్పవాణ్ణయ్యానా?! కాదు ఇదంతా కలేనేమో!’ అనిపించింది. హడావుడిగా లేచి పార్కింగ్‌కి వెళ్లి కారు డోర్ తీసి… హారన్ మోగించాక కానీ… నాకు తృప్తిగా అనిపించలేదు.
ఎంతగా ఆచితూచి ఖర్చుపెట్టినా మన కలలని దూరం చేసుకోకూడదనీ, అవే మన జీవితాల్ని ఉత్సాహంతో నింపుతాయనీ ఆ రోజే తెలుసుకున్నాను.
అనుమానంతో కాదు… ప్రేమతో..
చిన్నప్పుడు స్కూల్లోనే కాదు, ఇప్పటికీ నేను ఇంగ్లిషు అక్షరాలని గుర్తుపెట్టుకోలేను. విదేశాలకి వెళుతున్నప్పుడు ఎయిర్‌పోర్టులో దరఖాస్తు నింపాలికదా… అందులో ‘ఇండియన్’ అనే పదాన్ని రాయాలన్నా తడబడతాను.
లలితా జ్యువెలరీస్ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల సామ్రాజ్యం! అయినా నేను ఇప్పటికీ కరెన్సీ కట్టల్ని సరిగ్గా లెక్కపెట్టలేను. ఎప్పుడు లెక్కపెట్టినా ఎక్కువో తక్కువో వస్తుంది.
అయితే లాభనష్టాలని మాత్రం కచ్చితంగా భేరీజు వేయగలను. ఫలానా గంటకి ఇంత బిజినెస్ జరుగుతుందని చెప్పగలను. చదువులేని నాకు దేవుడిచ్చిన పెద్ద వరం ఆ ‘మైండ్ కాలిక్యులేషన్’ అనిపిస్తుంది.
అంతకన్నా పెద్ద వరం నా ఉద్యోగులు. నెల్లూరులో ఒకప్పుడు నాతో కలిసి పనిచేసినవాళ్లూ, వాళ్ల పిల్లల్లో 90 శాతం మంది ఇప్పటికీ మా దగ్గర పనిచేస్తున్నారు.
నాకు చదువులేకున్నా వాళ్లేం రాస్తున్నారో… ఏ లెక్కలు వేస్తున్నారో అని ఇంకెవరి చేతో తనిఖీ చేయించను. పక్కవారిని అనుమానంతో కాకుండా ప్రేమతో ఆదరిస్తే అద్భుతాలు చేయొచ్చనే విశ్వాసం నా ఉద్యోగుల వల్లే వచ్చింది.
ఉన్నంతలో కొంత….
మేమెక్కడ షోరూమ్ తెరిచినా దానికి అనుబంధంగా ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలోని వృత్తిపనివాళ్లకి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ రకంగా మా సంస్థలో వేలాదిమంది ఉద్యోగులున్నారు.
మా దుకాణాల్లో పనిచేసేవాళ్లందరికీ మధ్యాహ్నంపూట ఉచితంగా భోజనం పెడతాం. ఇక తనకున్న చిట్టచివరి బంగారు నగలతో నన్ను ఇంతటివాణ్ణి చేసిన అమ్మ గుర్తుగా, ఆమె పెరిగిన రాజస్థాన్ బలానా ప్రాంతంలో పెద్ద బడి కట్టించాను.
వెయ్యిమంది పిల్లలు ఉచితంగా చదువుకోవచ్చు అక్కడ! వందేళ్లపాటు సున్నం కొట్టాల్సిన అవసరం లేకుండా చలువ రాళ్లతో కట్టించాను.
మనం ఎంత ఎత్తుకి ఎదిగినా దానికి ఏదో రకంగా వనరులని ఇచ్చేది ఈ సమాజమే! దానికి తిరిగి ఇవ్వడంలోని సంతృప్తి చిన్నదేం కాదు!
ఇంతా ఎందుకు చెబుతున్నానంటే….
‘గుండుబాస్’, ‘గుండాయన’… నా అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది నన్నిలాగే గుర్తుపెట్టుకుంటున్నారు.
ఇక నా ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు. నిజానికి ఇవన్నీ నాకు కోపం తెప్పించడం లేదు… నేనూ వాటిని భలే ఎంజాయ్ చేస్తున్నా!
వాటిని తయారుచేసేవాళ్లలో ఎక్కువశాతం యువతేనట. నాపైన ఎంతగా జోకులేసి నవ్వుకున్నా… యువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా!
ఆ కలలు నెరవేరేందుకు ఎంతోకొంత ఉపయోగపడతాయనే ఆశతోనే వాళ్ల పెద్దన్నగా నా జీవితానుభవాలను ఇలా మీతో పంచుకుంటున్నాను. ‘డబ్బులెవరికీ ఊరికే రావు…’ అంటూ టీవీల్లో కనిపించే నేను ‘విజయం ఎవరికీ ఊరికే రాదు..’ అని యువతకి చెప్పాలనుకుంటున్నా.
అదో కోమాలో ఉంటాను!
నేను ‘లలితా’ సంస్థని కొనడానికి కాస్త ముందే హేమతో పెళ్లైంది. వాళ్లది చెన్నైలో స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబం. మాకు ముగ్గురు పిల్లలు. భక్తి, భవ్య అని కవలలు.
చిన్నవాడు హీత్(దీని అర్థమేంటో వాళ్లమ్మకి మాత్రమే తెలుసు!)కి ఇప్పుడు పందొమ్మిది నెలలు. పిల్లలతో కలిసి ఏడాదికి రెండుమూడుసార్లయినా విదేశాలకి వెళుతుంటాను. అక్కడికెళ్లినా వ్యాపారం గురించే ఆలోచిస్తుంటాను.
‘మీరు ఎక్కడికొచ్చినా బిజినెస్ కోమాలో ఉన్నట్టుంటారు… ’ అని విసుక్కుంటారు నా పిల్లలు. నేను వదిలించుకోవాలనుకుంటున్న లక్షణం కృషి పట్టుదలతో పాటు ‘అవసరం’ మనిషిని ముందడుగు వేసేలా చేస్తుంది! ఏమీ లేని నుంచే … ప్రారంభం … మొదటి మెట్టు! ఎక్కుతూనే ఉంటారు ఒక్కో మెట్టు … విజయానికి చివరి మెట్టు ఉండదు!
ఒక రకంగా కూలీ పని చేసే కుటుంబం… 9 మంది సంతానం… తినడానికి తిండి… ఉండడానికి సరైన ఇల్లు లేని పేదరికం… అక్షరాలు కూడా గుర్తు పట్టలేని వ్రాయలేని చదువు…
కానీ… కానీ… ఆ పేదరికం లోనే… బాల్యం లోనే నిర్ణయించుకున్న లక్ష్యం…. ఆ లక్ష్యం సాధించడం కోసం నిరంతర శ్రమ… కొన్ని గంటలు మాత్రమే నిద్ర పోయే కఠోర శ్రమ…. నా ఉద్యోగస్తులను నా కుటుంబంలా చూసుకొనే కొన్ని విలువలు… నిద్రలో కూడా వ్యాపారం గురించే ఆలోచించే తత్వం… నిరంతరం ప్రస్తుతం ఉన్న సంస్థలు… కొత్త వాటిని స్థాపించే ఆలోచనలు… వాటిలో జరిగే వ్యాపారం.. ఇంకా పెరుగుదల కోసం నిరంతరం అప్రమత్తతతో తీసుకోవలసిన నిర్ణయాల గురించిన ఆలోచనలు… వీటన్నిటి మధ్య కుటుంబానికి కేటాయించే క్వాలిటీ టైమ్… వర్క్ అండ్ ఫ్యామిలి లైఫ్ బ్యాలెన్స్… చివరిగా ముఖ్యంగా నాకు ఇంత ఇచ్చిన సమాజానికి నేనూ ఎంతో కొంత ఇవ్వాలనే తాపత్రయం… అన్నిటి కన్నా ముఖ్యంగా మానవ విలువలు… సంబంధాలు.. వాటికి నేను ఇచ్చే ప్రాధాన్యత…
పై, నా.. ప్రయాణం చదివారు కదా నేనే ఇన్ని చేయగలిగాను అంటే మీరూ తప్పకుండా ఇంకా చాలా చేయవచ్చు… క్లారిటీ గా ఉండండి… లక్ష్యం ఉన్నతంగా ఉంచుకోండి… సాధించే వరకూ విశ్రమించకండి… ప్రయత్నాన్ని ఆపకండి… విజయం తప్పక వరిస్తుంది… ఇదే యువతకు నేనిచ్చే సలహా…
నా జీవితం ప్రయాణం నిజాయితీగా మీ ముందు ఉంచాను…
ఇది చదివి ఏ ఒక్కరు స్పూర్తి పొందినా… మీకన్నా నేనెక్కువ ఆనంద పడతాను… అందరికీ నమస్కారం…
మరొక్క సారి…
డబ్బులు ఎవరికీ ఊరికే రావు….
అలానే
“”విజయాలు కూడా ఎవరికీ సులభం గా రావు””…
“”Planned Hard work”‘
(యువత ఇలాంటి వారి అనుభవాలను తప్పక చదవాలి! ఇలాగే కాకున్నా … మరోలా విజయాలు సాధించవచ్చు!)
*మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే “మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం”. మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం*
Wedding Invitation Voice Calls,Sms,
WhatsApp
Call
Mottobyte
8520986185
1) ఈ రోజు పొద్దున్నే నువ్వు “ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే “.దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*
2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే.ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*
3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే.300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*
4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని, ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే.ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*
5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే.ప్రపంచంలో 8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*
6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే, ఈ ప్రపంచపు 15 శాతం మంది “అనాధ కుటుంబాలలో “నువ్వు ఒకడివి కాదన్నమాట. “జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు”. అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ “నువ్వూ అలాంటి వాడివే ” కాకూడదు కదా !*
7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*
8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*
9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_
*ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో “తృప్తికి మించిన సంపద ” మరొకటి లేనేలేదు.*
*ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను*
*అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*
*మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం. మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మనిచ్చారు అంటే మన అంత అదృష్టవంతులు ఈ భుమి మీద మరెవరు ఉండరు*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* *సర్వేజనా సుఖినోభవంతు* *లోకా సమస్త సుఖినోభవంతు* *శుభం భూయాత్* *ఓం శాంతి శాంతి శాంతిః* *స్వస్తి* 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸