మీరు అదృష్టవంతులే!….


🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
*మీరు అదృష్టవంతుడివో / అదృష్టవంతురాలివో  తెలుసా…?? ???*

*మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే “మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం”. మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం*

Wedding Invitation Voice Calls,Sms,

WhatsApp

Call

Mottobyte

8520986185


1) ఈ రోజు పొద్దున్నే నువ్వు “ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే “.దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*

2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే.ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*

3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే.300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*

4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని,  ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే.ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*

5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే.ప్రపంచంలో  8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*

6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి,  వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే, ఈ ప్రపంచపు 15 శాతం మంది “అనాధ కుటుంబాలలో “నువ్వు ఒకడివి కాదన్నమాట. “జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు”. అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ “నువ్వూ అలాంటి వాడివే ” కాకూడదు కదా !*

7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*

8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*

9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_

*ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో “తృప్తికి మించిన సంపద ” మరొకటి లేనేలేదు.*

*ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను*

*అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*

*మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం. మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మనిచ్చారు అంటే మన అంత అదృష్టవంతులు ఈ భుమి మీద మరెవరు ఉండరు*

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
*శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

స్టీవ్ జాబ్స్ చివరి మాటలు

25-Apr-25,
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు

స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:

పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.

రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.

నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే ” జీవితం ”.

*అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.

“మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.”

“30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.”

“మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.”

“ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.”

“మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.”

“నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.”

Wedding Invitation Voice Calls,

Sms, WhatsApp to your Invitees

Mottobyte

8520986185

*💐అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.

జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి.

👉(1). మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.
👉(2). ఆహారమే ఔషధం. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.
👉(3). వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.
👉(4). మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.
*👉(5). వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వేజనా సుఖినోభవంతు
లోకా సమస్త సుఖినోభవంతు
శుభం భూయాత్
ఓం శాంతి శాంతి శాంతిః
స్వస్తి
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

Scroll to Top